పండుగ సీజన్‌పై ఆశలు పెట్టుకున్న కార్ల కంపెనీలు..

by Harish |
cars
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థలు మారుతీ సుజుకి, టయోటా కిర్లోస్కర్, మహీంద్రా అండ్ మహీంద్రా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పండుగ సీజన్‌లో అమ్మకాలు మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నాయి. చిప్‌ల కొరత కొనసాగుతున్నప్పటికీ కంపెనీలు ఉత్పత్తిని మెరుగ్గా నిర్వహిస్తూ, వినియోగదారులకు వాహనాలను అందించాలని లక్ష్యంగా ఉన్నాయి. నవంబర్‌లో దీపావళి వరకు ఉండే పండుగ సీజన్ నేపథ్యంలో ఆటో కంపెనీలు ఇప్పటివరకు గణనీయమైన డిమాండ్‌ను చూశాయి. రానున్న అక్టోబర్‌లో పండుగల సమయంలో వినియోగదారులకు వాహనాలను అందించేందుకు డీలర్ల వద్దకు సరఫరాను పెంచాయి.

‘ప్రస్తుతం డిమాండ్ మెరుగ్గా ఉంది. గతేడాది కంటే ఎక్కువగానే ఉంది. బుకింగ్, ఎంక్వైరీ, ఇంకా ఇతర అంశాలను పరిగణలోకి తీఉస్కుని సరఫరాలో ఉన్న సవాళ్లను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని’ మారుతీ సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు. ఇప్పుడున్న డిమాండ్‌ను 2017-19 మధ్య కాలంతో పోలిస్తే 22-23 శాతం వెనకబడే ఉన్నాం. అయితే, ప్రస్తుత డిమాండ్‌ను మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నమని, పండుగ సీజన్‌లో ఈ డిమాండ్ వృద్ధి పెరుగుతుందనే నమ్మకం ఉందని మహీంద్రా ఆటోమోటివ్ విభాగం సీఈఓ విజయ్ నక్రా అన్నారు.

Advertisement

Next Story