- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫేస్‌బుక్ మెసెంజర్‌లో కొత్త ఫీచర్
దిశ, వెబ్‌డెస్క్: ఆటో స్టేటస్ పేరుతో ఓ సరికొత్త ఫీచర్‌ను ఫేస్‌బుక్ మెసెంజర్‌లో తీసుకురాబోతున్నారు. ఈ ఫీచర్ ద్వారా మీకు దగ్గరలో ఉన్న స్నేహితులకు మీరు ఎక్కడ ఉన్నారనే సంగతి ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది. ప్రస్తుతం డెవలప్‌మెంట్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలో కొంతమందికి మాత్రమే అందుబాటులోకి రానుంది. ఈ ఆటోస్టేటస్ ఫీచర్ గురించి ఫేస్‌బుక్ ప్రతినిధి అలెక్సాండ్రూ వొయికా ట్విట్టర్ ద్వారా స్పష్టతనిచ్చారు.
ప్రస్తుత లొకేషన్, యాక్సెలెరోమీటర్, బ్యాటరీ లైఫ్ పారామీటర్లను ఉపయోగించుకుని యూజర్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడో వివరాలను క్లోజెస్ట్ స్నేహితులకు పంపిస్తుంది. అయితే ఈ క్లోజెస్ట్ స్నేహితుల జాబితాను ముందుగా వినియోగదారుడు సృష్టించుకోవాల్సి ఉంటుంది. 2018 నుంచి ఇలాంటి ఫీచర్ల మీద ఫేస్‌బుక్ పరిశోధన చేస్తోంది. దీని గురించి మొదటగా బయటి ప్రపంచానికి తెలిసినపుడు వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. అయితే ఇన్‌స్టాగ్రాంలో దాదాపు ఇలాంటి ఫీచర్ అందుబాటులో ఉండటంతో దానికి బాగా ఆదరణ దొరికింది. దీంతో ఫేస్‌బుక్ మెసెంజర్ లో కూడా ఇలాంటి ఫీచర్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
Tags : Facebook, Autostatus, Instagram, Feature, location, Whereabouts