ఆటో, ట్యాక్సీలు నిబంధనలు పాటించాలి

by Shyam |
ఆటో, ట్యాక్సీలు నిబంధనలు పాటించాలి
X

దిశ, న్యూస్‌బ్యూరో: హైదరాబాద్‌లో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, ప్రయాణికులు ప్రభుత్వ నిబంధనలు తప్పక పాటించాలని లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం రావు హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల అమలు విషయమై నగరంలో రవాణా శాఖ, పోలీసుశాఖ సమన్వయంతో కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. మంగళవారం ట్రాన్స్‌పోర్టు భవన్ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని ఆర్టీఏ కార్యాలయాల అధికారులతో కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో వాహన రిజిస్ట్రేషన్‌, లైసెన్సుల జారీ లాంటి కార్యకలాపాలు సజావుగా కొనసాగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నందువల్ల రాష్ట్ర సరిహద్దుల వద్ద సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లాక్‌డౌన్ సమయంలో సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది సమర్ధవంతంగా పనిచేశారని, నిత్యావసరాలు ఆటంకాలు లేకుండా సరఫరా చేయడానికి వారి సేవలు ఉపయోగపడ్డాయని ఈ సందర్భంగా వారిని కమిషనర్ ప్రశంసించారు.

Advertisement

Next Story