- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెత్తి మీద విగ్గు.. లోపల ఏముందో తెలిస్తే షాక్ అవుతారు..
దిశ,వెబ్ డెస్క్ : దుబాయ్ షార్జాల గుట్టు రట్టుచేసిన కస్టమ్స్ అధికారులు. నెత్తిపై విగ్గు ధరించి అందులో ముడి బంగారాన్ని దాచి అక్రమంగా రవాణా చేస్తున్న ఏడుగురిని చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అదే సమయంలో రూ. 24 లక్షల విలువైన విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు.
వివరాల ప్రకారం.. నిన్న దుబాయ్, షార్జా నుంచి రెండు ప్రత్యేక విమానాలు చెన్నై చేరుకున్నాయి. అందులో వచ్చిన ప్రయాణికుల్లో కొందరి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో చెన్నై, తిరుచ్చి, రామనాథపురం, విళుపురం, సేలం జిల్లాలకు చెందిన ఏడుగురు నిందితుల నుంచి అధికారులు రూ. 2.53 కోట్ల విలవగల బంగారం పేస్ట్ ని స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో చెన్నైనుంచి షార్జాకు అక్రమంగా తీసుకెళ్లేందుకు తెచ్చిన రూ.24 లక్షల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు.