‘కౌ బట్ హౌ’ మరో వ్యంగ్య పుస్తకాన్ని విడుదల చేసిన బెరోజ్‌గర్

by Sujitha Rachapalli |
‘కౌ బట్ హౌ’ మరో వ్యంగ్య పుస్తకాన్ని విడుదల చేసిన బెరోజ్‌గర్
X

దిశ, ఫీచర్స్ : ఇటీవలే ప్రధాని మోదీపై వచ్చిన ఓ పుస్తకం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆ పుస్తకమే ‘మాస్టర్‌స్ట్రోక్: భారతదేశ ఉపాధి వృద్ధిలో ప్రధాన మంత్రికి సహాయపడిన 420 రహస్యాలు!’ (Masterstroke : 420 secrets that helped PM in India’s employment growth!). పీఎం మోదీని అపహాస్యం చేస్తూ వ్యంగ్యంగా రాసిన ఈ పుస్తక రచయిత బెరోజ్‌గర్ భక్త్.. మరో కొత్త పుస్తకంతో వస్తున్నాడు. అదే ‘కౌ!బట్ హౌ!(Cow? But How?)

బెరోజ్‌గర్ రాసిన తొలి పుస్తకం మాస్టర్ స్ట్రోక్‌లో ‘56’పేజీలుండగా, అవన్నీ ఖాళీ పేజీలే. దీని ధర కూడా రూ. 56/- కావడం విశేషం. మోడీ మద్దతుదారులు తనకు 56 అంగుళాల ఛాతీ ఉందని తరచుగా ఉపయోగించే పద బంధాన్ని సూచించే విధంగా ఆ సంఖ్యతోనే పేజీలు, ధర నిర్ణయించాడు. మొదట్లో అమెజాన్‌లో ఈ పుస్తకం లభ్యం కాగా, ఆ తర్వాత దీన్ని తొలగించింది. ఇక బెరోజ్‌గర్ మరోసారి మోదీనే అస్త్రంగా చేసుకుని ‘కౌ!బట్ హౌ’(Cow? But How?!: 108 Points How Cow Dung And Gaumutra Cures Everything) అనే పుస్తకాన్ని రాశాడు. ఆవు పేడ, మూత్రం ఎలా రోగాలను నయం చేస్తాయో తెలిపే 108 పాయింట్లనే బేస్ చేసుకుని ఈ పుస్తకాన్ని తీసుకువస్తున్నాడు.

25 పేజీల పుస్తకంలో కొన్ని ఆవులుండగా, ఈ పుస్తకం ఆవు పేడ, మూత్రాన్ని ఉపయోగించి వివిధ వ్యాధుల నుంచి కోలుకున్న వారందరికీ అంకితం చేశాడు. ఈ పుస్తకంలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ రాసిన ‘రెండు విషయాలు అనంతం : విశ్వం, మానవ మూర్ఖత్వం. విశ్వం గురించి నాకు కచ్చితంగా తెలియదు’ అనే కోట్ కూడా ఈ పుస్తకంలో ఉండటం విశేషం. 5 సంవత్సరాల, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ఈ పుస్తకాన్ని సులభంగా చదవగలరని, ఆవు ప్రాధాన్యతపై అవగాహన పెంచుకోవచ్చని రచయిత తెలిపాడు. అయితే బెరోజ్‌గర్ మరోసారి ఈ పుస్తకాన్ని కూడా ఖాళీ పేజీలతోనే ప్రింట్ చేయించాడు. ‘ఏ శాస్త్రీయ రుజువు లేకుండా ఆవు పేడ, మూత్రాలు వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుందని నమ్ముతున్న వారందరినీ పోక్ చేయడమే రచయిత ఉద్దేశమని’ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘ఆవు మలమూత్రాల శాస్త్రీయ ప్రయోజనాలను మీరు రాసి, మీ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవాలని రచయిత కోరుకుంటారు. లేదా మీరు దానిని డైరీగా తీసుకొని, జాతీయ టీవీలో ఒక మంత్రి దాని గురించి మాట్లాడేటప్పుడు ఆవు పేడ, మూత్రం ఉపయోగాలను తెలుసుకోండి’ అంటూ మరికొంతమంది నెటిజన్లు వ్యాఖ్యనించారు. ఇప్పటికే ఈ పుస్తకంపై కొందరు సమీక్షలు కూడా రాశారు.

Advertisement

Next Story

Most Viewed