Sexual Harassment : మైనర్ బాలికపై అత్యాచారయత్నం..

by Aamani |   ( Updated:2021-05-23 05:23:23.0  )
Sexual Harassment : మైనర్ బాలికపై అత్యాచారయత్నం..
X

దిశ, ముధోల్ : రానురాను నేటి సమాజంలో మానవత్వం మంటగలిసిపోతోంది. మృగాళ్ల వారి కామవాంఛ తీర్చుకునేందుకు చిన్నపెద్దా తేడా లేకుండా విచక్షణ మరిచి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అలాంటి ఘటనే భైంసా పట్టణంలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే… భైంసా పట్టణానికి చెందిన షేక్ అజీమ్(24) మేస్త్రీ పనిచేస్తుంటాడు. అయితే అజీమ్ నివసించే వాడలోనే ఉంటున్న ఓ మైనర్ బాలిక (7) పై శనివారం రాత్రి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబీకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసుల తెలిపారు.

Advertisement

Next Story