మా ఎమ్మెల్యే కనబడుట లేదంటూ.. అసెంబ్లీ ముట్టడి యత్నం..

by Shyam |   ( Updated:2021-03-15 01:27:06.0  )
మా ఎమ్మెల్యే కనబడుట లేదంటూ.. అసెంబ్లీ ముట్టడి యత్నం..
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వేములవాడవాసుల అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. వెంటనే స్పందించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వేములవాడవాసులు మాట్లాడుతూ.. తమ నియోజకవర్గ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కనబడుట లేదని ఆరోపించారు. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలంటూ నినాదాలు చేశారు. అందుకే తాము అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించినట్టు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed