- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లాడ్జిలో రూమ్ లేదు.. వాచ్‌మెన్‌ను చితక్కొట్టిన కస్టమర్లు
by Sumithra |
X
దిశ, గద్వాల: లాడ్జిలో రూమ్ ఖాళీ లేదన్న పాపానికి వాచ్‌మెన్‌పై దాడి చేశారు కస్టమర్లు. ఈ సంఘటన గద్వాల జిల్లా కేంద్రంలోని అభి 999 లాడ్జిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధరూర్ మండలం పెద్దపాడు గ్రామానికి చెందిన బోయ లక్ష్మన్న.. గద్వాల జిల్లా కేంద్రంలోని అభి 999 లాడ్జిలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని నల్లకుంట ప్రాంతానికి చెందిన ప్రవీణ్, కార్తీక్‌లు రూమ్ కోసం లాడ్జికి వచ్చారు. రూమ్ ఖాళీ లేదని వాచ్‌మెన్ చెప్పడంతో.. అతడిని రోడ్డు మీదకు లాక్కొచ్చారు. మాకే రూమ్ అద్దెకు ఇవ్వవా అంటూ అసభ్య పదజాలంతో దూషిస్తూ.. వాచ్‌మెన్‌పై దాడి చేశారని పట్టణ ఎస్సై హరిప్రసాద్ తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.
Advertisement
Next Story