మద్యం తాగుతూ పట్టుబడ్డ అధికారులపై అట్రాసిటీ కేసు

by Sridhar Babu |

దిశ, ఖమ్మం: జిల్లాలోని మధిర రెవెన్యూ గెస్ట్‌హౌస్‌లో మద్యం తాగుతూ పట్టుబడిన అధికారులపై అట్రాసిటీ కేసు నమోదైంది. మద్యం విందును బయటపెట్టేందుకు వెళ్లిన సమయంలో విలేకరులను కులం పేరుతో దూషిస్తూ, దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఆరుగురు అధికారులతో పాటు ఒక డ్రైవర్‌పై అట్రాసిటి కేసు న‌మోదు చేసిన‌ట్టు టూ టౌన్ ఎస్సై ఉదయ్‌కుమార్ తెలిపారు. విలేకరుల ఫిర్యాదు మేరకు ఆరుగురు అధికారులైన తహసీల్దార్ సైదులు, స‌బ్‌జైల‌ర్ ప్ర‌భాక‌ర్‌, ఈవోఆర్డీ రాజారావు, ఆర్ఐ మధుసూధనరావు, వీఆర్వో గంటా శ్రీనివాసరావు, వీఆర్ఏ త్రివిక్రమ్, ఎమ్మార్వో డ్రైవర్ల‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

Tags: Atrocity, case, against, officers, drinking alcohol, sc,st, khammam

Next Story