మహిళా ట్రైనీ SIపై అత్యాచారయత్నం కేసులో పోలీసు అధికారుల హైలైట్ స్టెప్..

by Shyam |   ( Updated:2021-08-03 21:49:16.0  )
మహిళా ట్రైనీ SIపై అత్యాచారయత్నం కేసులో పోలీసు అధికారుల హైలైట్ స్టెప్..
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : ట్రెయినీ ఎస్ఐపై అత్యాచార‌య‌త్నం చేసిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మ‌రిపెడ ఎస్‌హెచ్‌ఓ శ్రీనివాస‌రెడ్డిపై అట్రాసిటీ, అత్యాచార‌య‌త్నం కింద కేసులునమోదయ్యాయి. మ‌హ‌బూబాబాద్ జిల్లా మ‌రిపెడ పోలీసు స్టేష‌న్‌లో కేసు నమోదు చేశారు. ఎస్‌హెచ్ఓ‌ను మహబూబాబాద్ సబ్‌జైల్‌కు 14రోజుల రిమాండ్‌కు త‌ర‌లించిన‌ట్లు మ‌హ‌బూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి బుధ‌వారం ఉద‌యం ఒక ప్రక‌ట‌న‌లో తెలిపారు.

చట్టానికి ఎవరు కూడా చుట్టాలు కాదని, తప్పు చేస్తే ఎంతటివారైనా సరే శిక్షింపబడతార‌ని ఎస్పీ ప్రక‌ట‌న‌లో స్పష్టం చేశారు. బాధితురాలు ద‌ళిత అధికారిణి కావ‌డంతో శ్రీనివాస‌రెడ్డిపై అట్రాసిటి కేసు న‌మోదు చేశారు. ద‌ళిత సంఘాలు, మ‌హిళా సంఘాలు, సామాన్య ప్రజానీకం నుంచి వెల్లువెత్తుతున్న విమ‌ర్శల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న పోలీస్‌శాఖ అప్రమ‌త్తమైంది. ఈ కేసు విచార‌ణ‌ను సాధ్యమైనంత త్వర‌గా పూర్తి చేయాల‌ని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలుండ‌టంతో ఎస్పీ కోటిరెడ్డి స్వయంగా ప‌ర్యవేక్షిస్తున్నట్లు స‌మాచారం.

Advertisement

Next Story