- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఒలంపిక్ విజేతలతో మోదీ విందు
దిశ, స్పోర్ట్స్: టోక్యో ఒలింపిక్స్ పతక విజేత సింధుకు ఇచ్చిన మాటను ప్రధాని మోడీ నెరవేర్చారు. ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన సందర్భంగా తనతో కలిసి ఐస్‌క్రీం తింటానని షట్లర్‌కు మాటిచ్చారు. తాజాగా ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఆటగాళ్లను స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విశిష్ట అతిథులుగా ఆహ్వానించారు. సోమవారం, తన నివాసంలో వారికి అల్పాహార విందును ఇచ్చారు. ఈ సందర్భంగా సింధుతో కలిసి ఐస్ క్రీం తిన్నారు. బంగారు పతక విజేత నీరజ్ చోప్రాతో కలిసి ముచ్చటించారు. నీరజ్‌కు ఇష్టమైన చుర్మాను ప్రత్యేకంగా వండించారు. ప్రతి అథ్లెట్‌ను మోడీ అప్యాయంగా పలకరించారు. భవిష్యత్‌లో మరిన్ని గొప్ప విజయాలు అందించాలని ప్రోత్సహించారు. ఇతర ఆటగాళ్లతో కలిసి ఫోటోలు దిగారు. టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో భారత్ రికార్డు స్థాయిలో 7 పతకాలను గెలిచింది. అందులో బంగారు, 2 వెండి, 4 కాంస్యాలు ఉన్నాయి.