Kaushik Reddy: గాడిదకు పాడి కౌశిక్ రెడ్డి ఫోటో కట్టి ఊరేగింపు.. క్షమాపణలు చెప్పాల్సిందే!

by Ramesh N |
Kaushik Reddy: గాడిదకు పాడి కౌశిక్ రెడ్డి ఫోటో కట్టి ఊరేగింపు.. క్షమాపణలు చెప్పాల్సిందే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కరీంనగర్ జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, జగిత్యాల సంజయ్ కుమార్‌ల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. (MLA Sanjay Kumar) సంజయ్‌ను "ఒరేయ్ ఏ పార్టీరా నీది" అంటూ కౌశిక్ రెడ్డి అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు. దీంతో ఇద్దరి మధ్య గొడవ తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) తీరుకు నిరసనగా గాడిదకు కౌశిక్ రెడ్డి ఫోటో కట్టి సంజయ్ కుమార్ అనుచరులు ఊరేగించారు. పాడి కౌశిక్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలని సంజయ్ అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. (donkey) గాడిదకు పాడి కౌశిక్ రెడ్డి ఫోటో కట్టిన వీడియోలు తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఇదిలా ఉండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తాాజాగా (Speaker Gaddam Prasad Kumar) స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఆదివారం కరీంగనర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుపై విచారణ జరిపి అతడిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను సంజయ్ కోరారు.


Next Story

Most Viewed