- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
padi vs sanjay: స్పీకర్ వద్దకు చేరిన పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం

దిశ, డైనమిక్ బ్యూరో : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy)పై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (Sanjay) స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad) కు ఫిర్యాదు చేశారు. ఆదివారం కరీంగనర్ కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుపై విచారణ జరిపి అతడిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను సంజయ్ కోరారు. కౌశిక్ రెడ్డి తనపై అసభ్య పదజాలంతో దూషణలతో రెచ్చిపోయారు, సమావేశంలో మాట్లాడుతుండగా తనను తోసేశారని ఎమ్మెల్యే సంజయ్ సోమవారం స్పీకర్ ను కలిసి కంప్లైంట్ చేశారు. పాడి కౌశిక్ రెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా కలెక్టరేట్ ఘటనలో కౌశిక్ రెడ్డిపై ఇప్పటికే కరీంనగర్ లో మూడు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి దురుసు ప్రవర్తనపై పోలీసులు, స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది ఉత్కంఠగా మారింది.
ఏ క్షణమైనా కౌశిక్ రెడ్డి అరెస్టు?:
గత కొంత కాలంగా పాడి కౌశిక్ రెడ్డి తీరు సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఈ సారి ఏకంగా అందరిముందే జగిత్యాల ఎమ్మెల్యేపై పరుష పదజాలంతో ఘర్షణకు దిగడం వివాదాస్పదంగా మారింది. రాజకీయాల్లో ఉందాగా వ్యవహరించాల్సిన ప్రజాప్రతినిధులు ఇలా ఘర్షణకు దిగడం ఏంటని కౌశిక్ రెడ్డిపై అధికార పక్షం విమర్శలు గుప్పిస్తోంది. దీంతో ఈ వ్యవహారంలో మూడు కేసులు నమోదు కావడంతో కౌశిక్ రెడ్డి అరెస్టు ఖాయం అనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది.