- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రమేష్ ఆస్పత్రికి అచ్చెన్నాయుడి తరలింపు
by srinivas |

X
దిశ ఏపీ బ్యూరో: ఈఎస్ఐ మందులు, పరికరాల కొనుగోళ్ల వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ నేత అచ్చెన్నాయుడుని హైకోర్టు ఆదేశాల మేరకు గుంటూరులోని రమేశ్ ఆస్పత్రికి తరలించారు. అరెస్టుకు పూర్వమే పైల్స్ ఆపరేషన్ చేసుకున్న ఆయనను శ్రీకాకుళం నుంచి విజయవాడకు తీసుకురావడంతో గాయం తిరగబెట్టింది. దీంతో జీజీహెచ్‌లో మరోసారి ఆయనకు ఆపరేషన్ నిర్వహించి, అక్కడే ఏసీబీ అధికారులు ఆయనను మూడు రోజుల పాటు విచారించారు. అనంతరం ఆయనను డిశ్చార్జ్ చేసినప్పటికీ అనారోగ్యంతో ఉన్నానని, మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సకు అనుమతించాలని హైకోర్టును ఆశ్రయించడంతో అనుమతి లభించింది. ఈ మేరకు ఆయనను విజయవాడ సబ్ జైలు నుంచి రమేశ్ ఆస్పత్రికి తరలించారు.
Next Story