- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > జిల్లా వార్తలు > ఖమ్మం > మాజీ ఎంపీ పొంగులేటి వెంట అశ్వాపురం టీఆర్ఎస్ లీడర్స్.. ఏం జరగబోతోంది?
మాజీ ఎంపీ పొంగులేటి వెంట అశ్వాపురం టీఆర్ఎస్ లీడర్స్.. ఏం జరగబోతోంది?
by Sridhar Babu |
X
దిశ, మణుగూరు : ఉమ్మడి ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం ప్రాంతంలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా నూతన పెట్రోల్ బంక్‌ను ప్రారంభించారు. అయితే, దుమ్ముగూడెంలో పొంగులేటి పర్యటన ఉందని తెలుసుకున్న అశ్వాపురం మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు సూదిరెడ్డి సులక్షణ గోపిరెడ్డి, నెల్లిపాక సహకార సంఘం అధ్యక్షులు తుక్కాని మధు సూధన్ రెడ్డి, తూము చిన్న రాఘవులు, ముత్యాల నర్సింహారావు, నిప్పు నెహ్రు మర్యాద పూర్వకంగా ఆయన్ను కలిశారు.
అశ్వాపురం మండల సమస్యల గురించి పొంగులేటితో కొద్దిసేపు చర్చలు జరిపారనేది విశ్వసనీయ సమాచారం. ఏదిఏమైనా పొంగులేటి పర్యటన ఎక్కడ ఉన్నా అశ్వాపురం మండల టీఆర్ఎస్ నాయకులు ఆయన వెంట ఉంటున్నారని మండలంలో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే అశ్వాపురం మండలంలో రాజకీయ మార్పులు ఏమైనా జరగబోతున్నాయనేది తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story