హరికి అందరి ముందు అదిచ్చి అషు ప్రపోస్.. షాక్‌లో శేఖర్ మాస్టర్

by Anukaran |   ( Updated:2021-09-22 04:32:00.0  )
హరికి అందరి ముందు అదిచ్చి అషు ప్రపోస్.. షాక్‌లో శేఖర్ మాస్టర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్ ప్రస్తుతం ఏదీ చేసినా వైరల్‌గా మారుతోంది. ఆర్జీవీని బోల్డ్‌గా ఇంటర్వ్యూ చేసి యూట్యూబ్‌ని షేక్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా మా టీవీలో వచ్చే కామెడీ స్టార్స్ ప్రోగ్రాం‌లో ముక్కు అవినాష్ తో పాటు ఎక్స్‌ప్రెస్ హరితో అషు స్కిట్‌లు చేస్తూ బిజీ బీజీగా ఉంటోంది. అషు రెడ్డి అంటే ఎక్స్‌ప్రెస్ హరికి ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఏకంగా గుండెలపై పచ్చ బొట్టు వేయించుకొని తన ప్రేమను తెలియజెప్పాడు హరి.

అయితే ఇదంతా స్కిట్ కోసమేనని, బయట వీరంతా మంచి స్నేహితులుగా ఉంటారని అందరూ అనుకున్నారు. కానీ, వచ్చే ఆదివారం ప్రసారమయ్యే కామెడీ స్టార్స్ షోలో అషు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. షో లో స్కిట్ జరుగుతున్న సందర్భంలో అషు రెడ్డి ఒక్క సారిగా ఎక్స్ ప్రెస్ హరికి ప్రపోస్ చేసి పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. దీంతో సెట్‌లో ఉన్న వారంతా షాక్ అయ్యారు. అంతేకాదు… ప్రపోస్ చేసి తనకి సర్‌‌ప్రైజ్ ఇచ్చేలా అందరూ చూస్తుండగానే స్పోర్ట్స్ బైక్ ని గిఫ్ట్ గా ఇచ్చింది. దీంతో ఎమోషనల్‌గా ఫీల్ అయిన హరి ఏడుస్తూ అషుకి హగ్ ఇచ్చి తన సంతోషాన్ని తెలిపాడు.

Advertisement

Next Story