షమీ భాయ్.. ప్లీజ్ ఆ ఒక్క వికెట్ నాకు ఇవ్వవా?

by Shyam |
షమీ భాయ్.. ప్లీజ్ ఆ ఒక్క వికెట్ నాకు ఇవ్వవా?
X

దిశ, స్పోర్ట్స్ : ఆటల్లో ప్రత్యర్థులతోనే కాదు సహచర ఆటగాళ్లతో కూడా పోటీ ఉంటుంది. క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ అయితే తానే ఎక్కువ పరుగులు చేయాలని, బౌలర్ అయితే ఎక్కువ వికెట్లు తీయాలని అనుకుంటుంటారు. ఇటీవల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అశోక్ దిండా అలా ఒక వికెట్ ఎక్కువ తీయడం కోసం సహచర బౌలర్ అయిన మహ్మద్ షమీని రిక్వెస్ట్ చేశాడంటా. ఈ విషయాన్ని దిండా ఒక క్రీడా వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్ జట్టుకు దిండా, మహ్మద్ షమి ఆడేవాళ్లు. దిండ 100వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ బెంగాల్ తరఫున చత్తీస్‌ఘడ్‌తో ఆడాడు. ఆ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో షమి, దిండా చెరి ఐదు వికెట్లు తీశారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో షమి, దిండా చెరి 4 వికెట్లు తీసి మ్యాచ్‌ను ముగించే పనిలో పడ్డారు. ఆ సమయంలో దిండా షమీ దగ్గరు వెళ్లి.. ‘భయ్యా ఆ వికెట్ నేను తీస్తాను.. ఈ ఒక్కసారి నాకు ఇచ్చెయ్. ఎందుకంటే ఇది నాకు 100వ మ్యాచ్. దీంట్లో 10 వికెట్లు తీసిన ఘనత అంటే చాలా స్పెషల్ కదా’ అని అభ్యర్థించాడంటా. దీనికి షమీ కూడా ఒప్పకోవడం దిండా మరో వికెట్ తీసి 10 వికెట్ల ఘనత అందుకోవడం జరిగిపోయింది. మ్యాచ్ అనంతరం షమీ దగ్గరకు వెళ్లిన దిండా.. థ్యాంక్స్ చెప్పాడంటా.

Advertisement

Next Story

Most Viewed