- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త ట్రక్కును విడుదల చేసిన అశోక్ లేలాండ్!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలండ్ గురువారం తన కొత్త ఏవీటీఆర్-4825 టిప్పర్ ట్రక్కును మార్కెట్లో విడుదల చేసింది. ‘డ్యుయెల్ టైర్ లిఫ్ట్ యాక్సిల్’, హెవీ డ్యూటీ బోగీ సస్పెన్షన్‌తో ఈ వాహనాన్ని తీసుకొచ్చినట్టు కంపెనీ తెలిపినంది. 29 క్యూబిక్ మీటర్ లోడ్ బాడీతో సరికొత్త ఏవీటీఆర్ మోడల్ ఐజెన్ టెక్నాలజీ 186-కేడబ్ల్యూ ఇంజిన్‌తో పనిచేస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఈ కొత్త మోడల్‌లో రీమోట్ డయాగ్నొస్టిక్, ఐ-అలర్ట్ లాంటి డిజిటల్ పరిష్కారాలు ఇందులో అమర్చినట్టు కంపెనీ వివరించింది. ‘ఏవీటీఆర్ మోడల్‌లో సరికొత్తగా చేర్చిన బోగీ సస్పెన్షన్ తమ వినియోగదారుల కోసం టెక్నాలజీ, ఇన్నోవేషన్ అందించినట్టు’ అశోక్ లేలండ్ సీఈఓ అనూజ్ కథూరియా అన్నారు. మైనింగ్, మౌలిక సదుపాయాలు, నిర్మాణ వంటి రంగాల్లో, పరిశ్రమలకు అనుగుణంగా ఉండేలా ఇంజిన్, డ్రైవ్‌లైన్ కంకర, లోడ్ బాడీ, కేబిన్ లాంటి ఇంకా ఇతర ఫీచర్లను ఇందులో అందించినట్టు అనూజ్ వెల్లడించారు.