యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోందని ఆగ్రహం..

by Shyam |
యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోందని ఆగ్రహం..
X

దిశ, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఆశా కో పరిశ్రమలో కార్మికుల చేస్తున్న నిరవధిక సమ్మె 11వ రోజుకు చేరింది. తమ సమస్యలను హైద్రాబాద్‌లోని లేబర్ కమిషనర్‌కు తెలిపేందుకు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్మికులు గురువారం హైదరాబాద్ తరలివెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు మల్లేష్ మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత 11 రోజులుగా సమ్మె చేస్తున్నా, యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ కార్మికులను బయటకు పంపి అదే మిషన్‌లపై సూపర్వైజర్‌లు, మేనేజర్లు కాంట్రాక్ట్ కార్మికులతో యాజమాన్యం పని చేయిస్తుందన్నారు. కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతున్న ఆశా కో యాజమాన్యంపై చర్య తీసుకొని కార్మికులకు న్యాయం చేయాలని గురువారం కమిషనర్ హైదరాబాద్ వద్దకు వెళ్తున్నామన్నారు. వెంటనే అక్రమ లే ఆఫ్ ఎత్తేయాలని, బకాయి వేతనాలు చెల్లించాలని, కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిచో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed