మద్యం మత్తులో ఆర్మీ ఉద్యోగి హల్‌చల్

by Anukaran |   ( Updated:2020-08-24 03:09:19.0  )
మద్యం మత్తులో ఆర్మీ ఉద్యోగి హల్‌చల్
X

దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు మండలం వరత్తూరు పంచాయతీ ఒగ్గువారిపల్లికి చెందిన ఓ ఆర్మీ ఉద్యోగి మద్యం మ్మత్తులో హల్‌చల్ చేశాడు. కోటాగరం గ్రామానికి వెళ్లిన ఆర్మీ ఉద్యోగి ఓ యువకుడిపై కత్తి, తుపాకీతో దాడికి యత్నించాడు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు ఆర్మీ ఉద్యోగిని పట్టుకుని ఓ ఇంట్లో నిర్బంధించారు. అతని చేతిలోని మారణాయుధాలు చూసి గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆర్మీ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story