- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బట్టతల వస్తుందని భయంగా ఉందా..? అయితే వీటిని తప్పకుండ తినండి
దిశ, వెబ్ డెస్క్: 25 ఏళ్లు కూడా రాలేదు అప్పుడే బట్టతల వచ్చేసింది అంటూ బాధపడుతున్నాడు ఓ యువకుడు.. చిన్నప్పుడు చాలా వత్తుగా ఉండే నా జుట్టు ఇప్పుడు పలచగా మారుతుంది ఓ యువతీ ఆవేదన.. బట్టతల ఉందని పెళ్లి జరగడం లేదు ఓ పెళ్లికాని ప్రసాదు కన్నీటి వ్యధ.. జుట్టు రాలిపోతుంది, పెరగడం లేదు..జుట్టు నిర్జీవంగా ఉంటుంది, ఏం చేయాలో తెలియడం లేదు ప్రస్తుతం అందరిని వేధిస్తున్న ఒక పెద్ద సమస్య. జుట్టు రాలిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. కాలుష్యం, పని ఒత్తిడిలు, ఆరోగ్య అలవాట్లు ఇలా కారణాలు చాలానే ఉన్నా పరిష్కారం మాత్రం ఒకటే. అదే.. ఆహారపు అలవాట్లు మార్చుకోవడం. జుట్టు పెరగడానికి ఎలాంటి ఆహరం తినాలి?, ఎలాంటి ఆహరం నుండి దూరంగా ఉండాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
గుడ్లు(Eggs)
కోడి గుడ్లులో ఉన్న ప్రొటీన్ వెంట్రుకలకు చాలా మంచిది. ప్రోటీన్ లోపం వలన జుట్టు రాలిపోతుంటే మీ రోజు వారి ఆహారంలో గుడ్లను భాగంగా చేసుకోండి. గుడ్లు లేదా గుడ్డులోని అన్ని అవసరమైన ప్రోటీన్లు, జుట్టును బలోపేతం చేస్తాయి మరియు జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తాయి. గుడ్డును తినడమే కాకుండా వాటితో హెయిర్ మాస్క్ వేసుకోవడం వలన అందులో ఉన్న ప్రోటీన్లు కుదుళ్లను బలంగా ఉండేలా చేస్తాయి. ఇకపోతే గుడ్డును ఉడికించి తినడం ఏంటో శ్రేయస్కరం .. అలా కాకుండా కొంతమంది గుడ్డు పచ్చిసొనను తింటూ ఉంటారు. ఆలా చేయడం వలన బయోటిన్ లోపం ఏర్పడుతుంది. పచ్చి గుడ్ల సొన తాగటంతో బయోటిన్ లోపం తలెత్తి.. జుట్టుకు పోషణ తగ్గి రాలటం పెరుగుతుంది. అందుకే జాగ్రత్తగా అన్ని తెలుసుకొని వాడడం మంచిది.
పండ్లు, కూరగాయలు(Fruits and vegetables)
జుట్టు కొద్దికొద్దిగా రాలిపోతుందంటే మీలో విటమిన్స్ లోపం ఉందని అర్ధం, సరైన విటమిన్లు , ప్రోటీన్లులు మీ శరీరంలో లేకపోవడం వలనే జుట్టు రాలడం మొదలవుతుంది. దీన్ని అధిగమించాలంటే పందులు , కూరగాయలు ఎక్కువగా తినడం అలవాటు చేసుకోవాలి. అవకాడో, బెర్రీలు , చిలకడ దుంపలు, గుమ్మడి గింజలు లాంటివి ఎప్పుడు తింటూ ఉండాలి. అంతేకాకుండా ఆకుకూరలు తోటకూర, పాలకూర వాటిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. వీటితో పాటు సోయాబీన్ ని కూడా అధికంగా తీసుకోవాలి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు. బీటా కెరోటిన్, విటమిన్ సి, ఏ, ఇరాన్ , జింక్ లాంటివి పుష్కలంగా ఉండడం వలన జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు నాజూకుగా తయారవుతుంది.
చక్కెర(Sugar)
జుట్టు రాలడం మొదలయ్యిందని తెలిసిన వెంటనే చక్కెర తినడం తగ్గించండి, వీలైతే పూర్తిగా మానేయండి. చక్కెరలో ఉన్న అధిక గ్లైసెమిక్ వలన జుట్టు రాలే ప్రమాదముంది. చక్కెర కాకుండా దాని బదులు పాతిక బెల్లం వాడడం ఉత్తమం. పటికబెల్లం శరీరానికి చలువ చేస్తుంది, జీర్ణశక్తిని పెంచి దేహానికి బలాన్ని ఇస్తుంది. అధిక గ్లైసెమిక్ ఉండే చక్కెర, బ్రెడ్, శుద్ధి పిండి లాంటి వాటికి దూరంగా ఉండండి.
ఆల్కహాల్(Alcohol)
జుట్టు రాలిపోవడానికి ప్రధాన సమస్య మద్యపానం. ఆల్కహాల్ ప్రోటీన్లను బలహీనపరుస్తుంది, దీంతో జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలే సమస్య తగ్గాలంటే ఆల్కాహాల్ ని దూరం పెట్టడం మంచిది. దీంతో పాటు డైట్ సోడాలను కూడా తగ్గించడం మంచిది. అస్పర్టేమ్ అనే కృత్రిమ స్వీట్నర్ ని వేసి డైట్ సోడాను తయారు చేస్తారు. దీని వలన వెంట్రుకలు బలహీనపడతాయి. జుట్టు రాలడం త్వరగా తగ్గాలనుకొంటే మందుకు , డైట్ సోడాలు దూరంగా ఉండడం మంచిది.
జంక్ ఫుడ్(Junk food)
ప్రస్తుతం యూత్ అంతా జంక్ ఫుడ్ నే ఇష్టపడుతున్నారు. కానీ వాటిలో ఉండే క్యాలరీలు, ఆయిల్ వలన ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వలన జుట్టు రాలే ప్రమాదముందని వైద్యులు తెలుపుతున్నారు. దీని బదులు ఇంట్లో తయారుచేసిన మాంసం , చేపలు తినడం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం తగ్గుతుందని స్పష్టం చేశారు. బట్టతలా రాకుండా ఉండాలంటే జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి.
మానసిక ప్రశాంతత(Peace of mind)
మనిషి ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు అనేది అతడి మనసు మీదే ఆధారపడి ఉంటుంది. మానసిక ఒత్తిడిలు. బట్టతల కోసం చికిత్స తీసుకునేవారిలో ఇలాంటి మానసిక సమస్యలు తీవ్రమవుతున్నాయి. వీరిలో కొందరు అతి ఒత్తిడితో డిప్రెషన్ లోకి వెళ్తుంటే మరికొందరు ఆత్మహత్య ఆలోచనల్లో మునిగిపోతున్నారు. ఎక్కువగా ఆలోచించడం వలన కూడా జుట్టు రాలిపోతుంది . బట్టతలా చికిత్స కోసం వచ్చినవారిలో సగం మంది మానసిక ఒత్తిడికి గురవుతున్నామని తెలిపినాట్లు వైద్యులు తెలుపుతున్నారు. ఎల్లపుడు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మానసిక ఒత్తిడిలకు ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యం మీ సొంతమవుతుంది.