- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యాక్సిన్ విషయంలో అపోహలున్నాయా.?.. ఇదీ మీ కోసమే..
దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలను భయాందోళనకు గురి చేసిన విషయం తెలిసిందే. ఇక సెకండ్ వేవ్ కారణంగా దేశంలో పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 22 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. అయినప్పటికీ చాలా మందిలో వ్యాక్సిన్ తీసుకోవడం పట్ల వివిధ రకాల అపోహలు ఉన్నాయి. ఈ క్రమంలో వైద్యులు.. వ్యాక్సిన్ తీసుకోవడం పట్ల అపోహలను నివృత్తి చేసే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కొన్ని ప్రశ్నలకు ఢిల్లీలోని ప్రముఖ ఆసుపత్రికి చెందిన వైద్యులు.. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను, అపోహల గురించి అవగాహన కల్పించారు.
నాన్ వెజ్ తినొచ్చా.?
వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎక్కువగా ఈ ప్రశ్నే ఎక్కువ మంది అడుగుతున్నారు. అయితే, వ్యాక్సినేషన్ తర్వాత మాంసం తినవచ్చంటూ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మాంసం తినడం పట్ల ఎలాంటి అపోహలు అవసరం లేదని వారు సూచించారు.
వ్యాక్సిన్ తీసుకున్నాక టెస్ట్ చేపిస్తే పాజిటివ్ వస్తుందా.?
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తమకు పాటిటివ్ వస్తుందని చాలా మంది భయపడుతుంటారు. ఇందులో నిజం లేదు. వ్యాక్సిన్ తీసుకున్నాక టెస్ట్ చేయించుకుంటే.. పాజిటివ్ రావడం అనేది జరగదు. అప్పటికే మీ శరీరంలో ఇన్ఫెక్షన్ సోకి వుంటే పాజిటివ్ వస్తుంది.
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా సోకుతుందా.?
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత శరీరంలో యాంటీబాడీలు సిద్దం అయ్యేందుకు 14 రోజుల సమయం పడుతుంది. అయితే, వ్యాక్సినేషన్ వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంటే వ్యాక్సీన్ తీసుకోకముందు, మీకు వైరస్ సోకుంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాక్సీన్ తీసుకుంటే వైరస్‌తో మన శరీరం మెరుగ్గా పోరాడుతుంది. ఇన్ఫెక్షన్ తీవ్రత అనేది మన శరీర స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది.
రక్తం గడ్డకడుతుందా.?
వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఇలాంటి భయం అనవసరం. వ్యాక్సినేషన్ తర్వాత రక్తం గడ్డకట్టడం చాలా అరుదుగా జరుగుతుంది. భారత్‌లో ప్రతి పది లక్షల మందిలో కేవలం 0.61 శాతం మందికే ఈ ముప్పు ఉంటుందని ఓ నివేదికలో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
కరోనా సోకిన తర్వాత వ్యాక్సినేషన్ అవసరం లేదా.?
కరోనా నుంచి కోలుకున్న తర్వాత వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత యాంటీబాడీలు కొన్ని రోజుల వరకే ఉంటాయి. కాబట్టి 90 రోజుల తర్వాత వ్యా్క్సిన్ తీసుకోవడం మంచిది.
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆల్కహాల్ తాగొచ్చా..?
దేశంలో చాలా మంది వేధిస్తున్న ప్రశ్న ఇది. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొన్ని గంటలు, రోజులు ఆల్కహాల్ తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే వ్యా్క్సిన్ తీసుకున్న తర్వాత.. అది శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలి. కొద్ది మందికి ఫీవర్, బాడీ ఫెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో కొద్ది రోజులు ఆల్కహాల్ తీసుకోకపోవడం మేలని వైద్యులు సూచిస్తున్నారు.
రుతుస్రావంలో మహిళలు వ్యాక్సిన్ తీసుకోవచ్చా.?
వ్యాక్సిన్లతో ఎలాంటి ముప్పూ వాటిల్లదు. కాబట్టి రుతుస్రావంలో ఉన్న మహిళలు కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు.
వ్యాక్సిన్ తీసుకుంటే నపుంసకత్వం వస్తుందా.?
వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఇలాంటిది ఏమీ జరగదని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఇలాంటి వదంతులు సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యులు కోరుతున్నారు.
గర్భిణిలు వ్యాక్సిన్ తీసుకోవచ్చా.?
దేశంలో ప్రస్తుతం గర్భిణిలకు వ్యాక్సినేషన్ చేయడం లేదు. గర్భిణిలపై క్లినికల్ ట్రయల్స్ ఇంకా పూర్తి కాలేదు. అయితే, అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో గర్భిణిలకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పిల్లలకు సైతం వ్యాక్సిన్ అందిస్తున్నారు.
వ్యాక్సినేషన్‌లో సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దంటూ వైద్యులు సూచిస్తున్నారు. ప్రజలందరూ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం, వైద్యులు చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం పట్ల ఎలాంటి సందేహాలున్నా వెంటనే వైద్యులను కలిసి తెలుసుకోవాలని సూచిస్తున్నారు.