డైరెక్టర్ అక్కడ టచ్ చేసేందుకు ప్రయత్నించాడు.. నటి ఆరాధన శర్మ

by Shyam |
Aradhana-Sharma
X

దిశ, సినిమా : టీవీ యాక్ట్రెస్ ఆరాధన శర్మ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంది. పుణెలో చదువుకుంటూ, మోడలింగ్ అసైన్‌మెంట్స్ చేస్తున్న సమయంలో ముంబై‌కి చెందిన కాస్టింగ్ డైరెక్టర్‌ కాల్ చేసి మంచి రోల్ ఉందని, హోమ్ టౌన్ రాంచీలోనే కాస్టింగ్ జరుగుతుందని వివరించాడని చెప్పింది.

దీంతో అక్కడకు వెళ్లిన తనకు బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఎదరురైందని తెలిపింది. రూమ్‌లో ఇద్దరమే ఉండగా.. స్క్రిప్ట్ చదువుతున్న తనను కాస్టింగ్ డైరెక్టర్ బ్యాడ్‌గా టచ్ చేశాడని వివరించింది. ఏం జరుగుతుందో అర్థం కానీ తను వెంటనే తోసేసి బయటకు పరుగెత్తుకుని వెళ్లిపోయానని చెప్పింది. 5ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన తనను డిప్రెషన్‌లోకి తీసుకెళ్లిందని చెప్పింది. అప్పటి నుంచి మరో వ్యక్తితో రూమ్ షేర్ చేసుకోవాలంటే భయమేస్తుందన్న ఆరాధన.. చివరకు నాన్నతో ఉన్నా సరే భయంతో వణికిపోయే స్థితికి చేరుకున్నానని తెలిపింది.

Advertisement

Next Story