- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వివాహిత పై ఏఆర్ కానిస్టేబుల్ అఘాయిత్యం
దిశ ఏపీ బ్యూరో: కంచే చేను మేసిన చందంగా, రక్షణ కల్పించాల్సిన పోలీసే వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో మంగళవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం రూరల్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వివాహితకు పామిడి మండలం రామరాజుపల్లికి చెందిన నరేష్‌తో కొంత కాలంగా పరిచయం ఉంది. దీంతో వీరిద్దరూ సోమవారం బుక్కరాయసముద్రం మండలం బోయకొట్టాల వద్దకు ద్విచక్రవాహనంపై వెళ్లారు.
వారిని గుర్తించిన చెన్నేకొత్తపల్లి మండలం పులేటిపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ తాను పోలీసునని, ఇక్కడేం చేస్తున్నారంటూ బెదిరించి, ఆమెను అనంతపురంలో వదిలి పెడతానని నమ్మించి బైక్‌పై ఎక్కించుకుని వెళ్లాడు. అనంతపురంలోని కొవ్వూర్‌నగర్‌లో ఉన్న తన రూమ్‌కు తీసుకెళ్లి, ఆమె పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తన స్నేహితుడు, అనంతపురంలో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ సురేంద్రనాథ్‌రెడ్డిని పిలిపించాడు. సురేంద్రనాథ్ రెడ్డి కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సాయంత్రం వరకు ఆమెను రూమ్ నుంచి కదలనివ్వకుండా చేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడి ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి ఆర్టీసీ బస్టాండ్ వద్ద విడిచిపెట్టారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అప్పటికే బోయకొట్టాల వద్ద ఉన్న నరేష్ 100కి డయల్ చేసి జరిగినదంతా తెలిపాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజశేఖర్‌తో పాటు సురేంద్రనాథ్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.