- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
దిశ ప్రతినిధి, హైదరాబాద్: సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజనీరింగ్ , టెక్నాలజీ (సీపెట్)ప్టాస్టిక్ , అనుబంధ పరిశ్రమలో సాంకేతిక సిబ్బంది అభివృద్ధి కోసం సీపెట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో మిషన్ ఆపరేటర్ అసిస్టెంట్ – ప్లాస్టిక్ ఎక్స్ ట్రూషన్లో మూడు నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు జిల్లా వెనకబడిన తరగతులు అభివృద్ధి సంస్థ ప్రకటించింది. ఇందుకు హైదరాబాద్ జిల్లా లోని ఓబీసీ, ఈబీసీ నిరుద్యోగ యువత నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. శిక్షణ కాలంలో జాతీయ వెనుక బడిన తరగతుల ఆర్ధిక , అభివృద్ధి సంస్థ ద్వారా ప్రతి నెలా రూ 1000 స్టైఫండ్, ఉచిత కోర్సు మెటీరియల్, యూనీఫాం వంటివి అందజేయనున్నట్లు ప్రకటించారు.
8, 10వ తరగతి పాస్ ఆపై తరగతులు చదివిన 18 ఏండ్లకు పై బడిన వారు అర్హులని తెలిపారు . ఓబీసీ అభ్యర్థులు రూ. 3లక్షలు, ఈబీసీ అభ్యర్థులు రూ.1 లక్ష లోపు వార్షిక ఆదాయం కలిగి ఉండాలని, శిక్షణ అనంతరం క్యాంపస్ ప్లేస్ మెంట్ అందించనున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటాను, వారి అర్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలు, నాలుగు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలను [email protected] మెయిల్‌కు పంపించాలని, ఇతర వివరాలకు 995933317, 7893586494 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు