- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇగ్నో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) 2020 వ సంవత్సరం జూలై అడ్మిషన్ల కొరకు వివిధ రకాల ప్రోగ్రాములలో సర్టిఫికెట్, పీజీసర్టిఫికెట్, డిప్లొమా, పీజీడిప్లొమా, డిగ్రీ, పీజీ(పోస్టు గ్రాడ్యుయేషన్) ప్రోగ్రాములలో చేరడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఇగ్నో హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం సంచాలకులు డాక్టర్ ఎస్.ఫయాజ్అహ్మద్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వివిధ రకాల నిర్ణయించబడిన ప్రోగ్రాములైన సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ సర్టిఫికెట్, పీజీడిప్లొమా, డిగ్రీ ప్రోగ్రాములలో ప్రవేశంపొందటానికి ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ విద్యార్థులకు పూర్తి ఫీజు మినహాయింపు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్నితెలంగాణరాష్ట్రంలోని ఎస్సీ , ఎస్టీ నిరుద్యోగ విద్యార్థులు సద్వినియోగంచేసుకోవాలని ఆయన సూచించారు.
ఆయా ప్రోగ్రాములలో ప్రవేశంకొరకు విద్యార్థులు ఆగస్టు 31 వ తేదీవరకు ఆన్ లైన్ విధానంలో ఇగ్నోవెబ్ సైట్ ద్వారా అడ్మిషన్లు పొందాలని కోరారు. ప్రోగ్రాములకు సంబంధించిన ఇతర పూర్తి వివరాలకు అభ్యర్థులు ఇగ్నోవెబ్సైట్ (అంతర్జాలం) www.ignou.ac.inనుసంప్రదిచాలని, మరిన్ని వివరాలకు అభ్యర్థులు [email protected] మెయిల్ ద్వారా పొంద వచ్చని వెల్లడించారు.