- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆగస్టు 3 కాదు కానీ.. సెప్టెంబర్ 5న పక్కా: ఏపీ ప్రభుత్వం
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మరోవైపు భవిష్యత్ తరాలను తీర్చిదిద్దాల్సిన పాఠశాలలు ఇంకా ప్రారంభం కాలేదు. విద్యాసంవత్సం ఆలస్యంగా ప్రారంభమవుతుందని, ఆగస్టు 3 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘంటాపథంగా చెబుతోంది. ఈ మేరకు ‘నాడు-నేడు’ కార్యక్రమంలో భాగంగా స్కూళ్లలోని మౌలిక సదుపాయాలు పెంచేందుకు ప్రణాళికలు అమలు చేస్తోంది.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, టాయిలెట్లు, బెంచీలు, బల్లలు తయారవుతున్నాయి. నాసిరకం గచ్చుల నుంచి విముక్తి కల్పిస్తూ టైల్స్, మార్బుల్స్ వేసే ప్రక్రియను కూడా కొన్ని స్కూళ్లలో చేపట్టారు. దీంతో ఏపీలో ఆగస్టు 3 నుంచి పాఠశాలలు పునఃప్రారంభ మవుతాయని అంతా భావిస్తుండగా… సెప్టెంబరు 5 నుంచి బడులు తెరిచేందుకు సిద్ధమవుతున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. బీహార్, ఢిల్లీ వంటి రాష్ట్రాలు ఆగస్టులోనే వివిధ సంరక్షణ చర్యలు చేపడుతూ స్కూళ్లు తిరిగి తెరవనున్నట్టు కేంద్రానికి చెప్పాయి.
పాఠశాలలు తెరవడంపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కేంద్ర ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. పాఠశాలలను తిరిగి ఎప్పుడు ప్రారంభించేదీ చెప్పాలని కోరింది. దీనిపై స్పందించిన ఏపీ విద్యాసంవత్సరం సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభమవుతుందని, 30 శాతం సిలబస్ తగ్గిస్తున్నామని, ఈ మేరకు మార్పులు జరుగుతున్నాయని తెలిపింది. స్కూళ్లు తెరిచినా వైరస్ వ్యాపించకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నామని, వివిధ ప్రణాళికలపై అధ్యయనం చేస్తున్నామని తెలిపింది. దీంతో ఏపీలో ఎడ్యుకేషనల్ ఇయర్ సెప్టెంబర్‌లో ప్రారంభం కావడం ఖాయమైంది.
పుస్తకాలు పంచేశారు.. యూనిఫాం కుట్టించేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు ఆగస్టు 3 ప్రారంభిస్తామని గతంలో ప్రకటించిన ప్రభుత్వం ఈ మేరకు పాఠ్య పుస్తకాలు పపిణీ చేసింది. కరోనా వైరస్ స్వైర విహారం చేస్తున్న నేపథ్యంలో ఎడ్యుకేషన్ విధానంలో మార్పులు దిశగా అడుగులు వేస్తామని చెబుతోంది. 30 శాతం సిలబస్ తీసేస్తామని పేర్కొంది. పుస్తకాలు పంచేసిన తరువాత పాఠ్యాంశాల తొలగింపు ఎలా? అన్నది ఎలా నిర్ణయిస్తుందని ఉపాథ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.