నిమ్మగడ్డకి షాక్.. ప్రివిలేజ్ కమిటీ నోటీసులు

by srinivas |   ( Updated:2021-03-17 08:18:09.0  )
nimmagadda ramesh kumar
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ చర్యలకు ఉపక్రమించింది. ఎస్ఈసీకి నోటీసులు పంపుతామని ఏపీ ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్థన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్ఈసీపై మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి మరోమారు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నేపథ్యంలో కాకాని గోవర్ధన్‌రెడ్డి నేతృత్వంలోని కమిటీ అత్యవసరంగా భేటీ అయ్యింది. నిమ్మగడ్డపై మంత్రులు చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్థన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి నోటీసులు పంపనున్నట్లు తెలిపారు. పదవిలో ఉన్నా లేకున్నా విచారణకు హాజరు కావాల్సిందేనని తెలిపారు. కమిటీ విచారణకు ఎస్ఈసీ అందుబాటులో ఉండాలని కోరారు. చర్యలకు ఎస్ఈసీ సైతం బాధ్యులేనంటూ కాకాని గోవర్థన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ పంచాయతీ ఎన్నికల సమయంలో.. మంత్రులకు ఎస్ఈసీ నోటీసులు ఇవ్వడం, ఆంక్షలు విధించడంపై మంత్రులు ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed