టీడీపీ నేతలు ఏం చేసినా మమ్మల్నేం పీకలేరు: మంత్రి అనిల్ కుమార్

by srinivas |   ( Updated:2021-10-23 03:18:00.0  )
Anil-Yadav-12
X

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరోసారి విరుచుకుపడ్డారు. చంద్రబాబు లాంటి ప్రతిపక్ష నేత రాష్ట్రంలో ఉండటం దౌర్భాగ్యమని విమర్శించారు. చంద్రబాబు, ఆయన సుపుత్రుడు ముఖ్యమంత్రిని అనరాని మాటలు అంటున్నారని చివరకు సీఎం తల్లిని కూడా విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తల్లిని విమర్శిస్తే ఉప్పు, కారం తిన్న వారెవరూ చూస్తూ ఉండరంటూ మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో ఉప్పు, కారం ఎక్కువగా తింటారు. కాబట్టి పౌరుషం, రోషం ఎక్కువగా ఉంటాయి. ఒక పక్క గిచ్చడం.. మరోపక్క మాపై దాడి చేశారు అని దొంగ దీక్షలు చేయడం చంద్రబాబుకే చెల్లిందని మండిపడ్డారు. అబ్బా, కొడుకులు ఎన్ని దొంగ దీక్షలు చేసినా ఈ రాష్ట్రంలో ఎవరు ఏమి పికలేరని విమర్శించారు.

సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం డ్రగ్స్‌తో ఏపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిందని… డ్రగ్స్‌ను ఎవరు ప్రోత్సహిస్తూన్నారో చూస్తే మీ మూలాలు బయటపడతాయన్నారు. డ్రగ్స్ తీసుకునే అలవాటు మీకు ఉంటే దాన్ని వైసీపీపై రుద్దడం దుర్మార్గమన్నారు. ఏ రోజు అయినా ప్రజా సమస్యలపై పోరాటం చేసారా.. కులాల మధ్య చిచ్చు పెట్టడం.. మతాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప అంటూ మంత్రి అనిల్ మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాపై దాడులు జరిగినా ఇక్కడే ఉన్నాం.. మీలా హైదరాబాద్‌లో దాక్కోలేదంటూ సెటైర్లు వేశారు. వైసీపీ కార్యకర్తలను టీడీపీ టచ్ కూడా చేయలేదన్నారు. మరోవైపు ఓ పత్రిక అధిపతిపై తీవ్ర విమర్శలు చేశారు. కులపిచ్చితో తమపై పిచ్చిరాతలు రాస్తున్నారని.. ఎన్ని పిచ్చిరాతలు రాసినా తమ వెంట్రుక కూడా పీకలేరంటూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed