ఈఏపీ సెట్ బైపీసీ స్ట్రీమ్ ఫలితాలు విడుదల..

by srinivas |   ( Updated:2021-09-14 05:59:34.0  )
ఈఏపీ సెట్ బైపీసీ స్ట్రీమ్ ఫలితాలు విడుదల..
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలోని అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌ బైపీసీ స్ట్రీమ్‌ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. మంగళగిరిలోని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 92.85 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది అర్హుల శాతం పెరిగిందని మంత్రి తెలిపారు. గతేడాది 80.62 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించగా నేడు..92.85శాతం పెరిగిందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన చందం విష్ణు వివేక్ మొదటి ర్యాంక్ సాధించాడని చెప్పారు.

అనంతపురానికి చెందిన శ్రీనివాస కార్తికేయ రెండు, హన్మకొండకు చెందిన బొల్లినేని విశ్వాస్ రావుకు మూడో ర్యాంక్, హైదరాబాద్‌కు చెందిన గజ్జల సమీహనరెడ్డి, కాసా లహరికి నాలుగు, ఐదు ర్యాంకులు వచ్చాయని మంత్రి సురేశ్ స్పష్టం చేశారు. బుధవారం నుంచి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని మంత్రి సురేష్‌ వెల్లడించారు. ఇప్పటికే ఇంజనీరింగ్ ఫలితాలను విడుదల చేయగా.. మంగళవారం అగ్రికల్చర్, ఫార్మసీ ఫలితాలు విడుదల చేశారు. ఈ రెండు విభాగాల్లో 83,822 మంది దరఖాస్తు చేసుకోగా.. 78,066 మంది పరీక్ష రాశారని, 72,488 మంది ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. 92.85 శాతం ఉత్తీర్ణత నమోదైందని మంత్రి సురేశ్ వెల్లడించారు.

Advertisement

Next Story