- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ ఏ జోన్‌లో ఉండే అవకాశముంది?
భారతదేశంలో కరోనా వ్యాప్తి నిరోధానికి లాక్‌డౌన్ చేపట్టి రేపటికి 21 రోజులు పూర్తవుతుంది. రేపటికి కరోనాపై పూర్తి స్పష్టత వస్తుందని, పటిష్ఠ లాక్‌డౌన్ ద్వారా కరోనాని అంతమొందించవచ్చని భారత్‌లోని నిపుణులు అంచనా వేశారు. అయితే వారి అంచనాలను తల్లకిందులు చేస్తూ, కరోనా కేసులు క్షణక్షణానికి పెరుగుతూ వైద్యులు, పరిశోధకులను అయోమయంలోకి నెడుతున్నాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ గడవు పొడిగిస్తారా? లేక విడతల వారీగా ఎత్తివేస్తారా? అన్న అనుమానాలు ఇంకా వీడలేదు.
నేటి సాయంత్రం జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో దేశాన్ని మూడు జోన్‌లు విభజించి, లాక్‌డౌన్ ఎత్తివేతపై తుది నిర్ణయం తీసుకొనున్నట్టు తెలుస్తోంది. దేశంలోని రాష్ట్రాల్లో కరోనా తీవ్రతను బట్టి జోన్ ప్రకటించనుంది. రెడ్, ఆరెంజ్, గ్రీన్ మూడు జోన్లుగా దేశాన్ని విభజించనున్నారు. 15 కంటే ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించనున్నారు. ఈ జోన్‌లో మరో రెండు వారాలు కఠిన ఆంక్షలు అమలు కానున్నాయి. 15 కంటే తక్కువ కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను ఆరెంజ్ జోన్‌గా ప్రకటించనున్నారు. ఈ ప్రాంతాల్లో పరిమిత కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది. ఏకేసులూ నమోదు కాని ప్రాంతాలను గ్రీన్ జోన్‌లుగా ప్రకటిస్తారు. ఈ జోన్‌లో కేవలం మాస్కులు ధరిస్తే సరిపోతుంది. ఇక్కడ ఎలాంటి ఆంక్షలు అమలు కావు. దేశంలో 430 జిల్లాల్లో ఇంతవరకు ఎలాంటి కరోనా కేసు నమోదు కాకపోగా… మన రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇంత వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
లాక్‌డౌన్ ఎత్తివేతపై ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయానికి వచ్చేశాయి. సీఎంలతో ప్రధాని నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పరిమితులతో కూడిన లాక్‌డౌన్ ఎత్తివేత అమలు చేయాలని సూచించారు. లేని పక్షంలో ఏపీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటుందని కూడా తెలిపారు. ఏపీలో 676 మండలాలున్నాయి. ఇందులో 40 మండలాలు రెడ్ జోన్‌లో ఉండగా, 45 ఆరంజ్ జోన్లు ఉన్నాయి. మిగిలిన ప్రాంతాలన్నీ గ్రీన్ జోన్‌లోనే ఉన్నాయి. ఏపీలో మెజారిటీ ఆరెంజ్ జోన్ పరిధిలో ఉండడం నేపథ్యంలో రేపు సాయంత్రం నుంచి లాక్‌డౌన్ ఎత్తివేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొనున్నట్టుగా సమాచారం.
Tags: andhrapradesh, corona virus, covid-19, red zone, orenge zone, green zone