- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో ఇక నుంచి హెచ్‌ఆర్‌సీ హెడ్ ఆఫీస్ ఎక్కడంటే?
దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానులకు శ్రీకారం చుట్టింది. అభివృద్ధి వికేంద్రీకరణ మూడు రాజధానులతోనే సాధ్యమని సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా.. కర్నూలును న్యాయ రాజధానిగా… అమరావతిని శాసన రాజధానిగా ప్రకటిస్తూ సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటన చేశారు.
ఈ మూడు రాజధానుల ప్రక్రియకు సంబంధించి అసెంబ్లీ తీర్మానం సైతం చేశారు. మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో తొలి అడుగు పడింది. కర్నూలులో ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్(ఏపీ హెచ్‌ఆర్‌సీ) ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హెచ్‌ఆర్‌సీ ప్రధాన కార్యాలయం కర్నూలులో ఏర్పాటు చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలును మానవ హక్కుల కమిషన్‌కి హెడ్ క్వార్టర్‌గా గుర్తిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయంతో ఇక మీదట కర్నూలు కేంద్రంగా ఏపీ మానవ హక్కుల కమిషన్ పని చేయనుంది.