ఏపీ ఎస్ఈసీ నీలం సాహ్నికి హైకోర్టు షాక్.. నోటీసులు జారీ

by srinivas |
Neelam Sahni, AP SEC
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం, ఎస్ఈసీతో పాటు ఇతర ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల ప్రకారం నీలం సాహ్ని నియామకం జరగలేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరు వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.

ఇదిలా ఉంటే మార్చి 31న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో నీలం సాహ్ని నియమితులయ్యారు. నీలం సాహ్మి ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏప్రిల్ 8న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. అయితే ఆ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసింది. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని సూచించిన సంగతి తెలిసిందే.

Advertisement
Next Story

Most Viewed