ఆ పార్టీ ఎమ్మెల్యేలపై హైకోర్టు సీరియస్

by srinivas |
ఆ పార్టీ ఎమ్మెల్యేలపై హైకోర్టు సీరియస్
X

దిశ ఏపీ బ్యూరో: వారంతా ప్రజాప్రతినిధులు.. చట్టాలు చేసేది వారే.. అయితే చట్టాలు చేసే ఆ ప్రజాప్రతినిధులే నిబంధనలను ఉల్లంఘించారని హైకోర్టు వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు ప్రజాప్రతినిధులంతా వైసీపీ పార్టీకి చెందిన వారు. వారిలో ఎమ్మెల్యే రోజా ఒకరు. వీరంతా కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ క్రమంలో బుధవారం హైకోర్టులో ఈ పిటిషన్లపై విచారణ జరిగింది. ప్రజాప్రతినిధులై ఉండి నిబంధనలను పాటించలేదని వారిపై అసహనం వ్యక్తం చేసింది. సదరు ప్రజాప్రతినిధులపై ప్రభుత్వం చర్యలు తీసుకోనప్పుడు వారిపై సీబీఐ విచారణ ఎందుకు జరిపించకూడదని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం తరపున వివరాలు అందించేందుకు కొంత సమయం ఇవ్వాలని ఏజీ కోరారు. అనంతరం విచారణను వచ్చే వారానికి హైకోర్టు వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed