కాంట్రాక్టు పద్దతిలో పని చేయుటకు డాక్టర్లు కావలెను: ఏపీ

by srinivas |
కాంట్రాక్టు పద్దతిలో పని చేయుటకు డాక్టర్లు కావలెను: ఏపీ
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వైద్యులంతా బిజీగా మారిపోయారు. సుదీర్ఘ కాలంగా ప్రభుత్వ వైద్య రంగాన్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో.. ఆసుపత్రులకు సరిపడా వైద్యులు లేరు. ఈ నేపథ్యంలోనే గత వారం నర్సీపట్నం అనస్తీషియా వైద్యుడు సుధాకర్ సంచలన వ్యాఖ్యలు చేసి, సస్పెండయ్యారు. దీంతో తీవ్రత గ్రహించిందో ఏమో కానీ… కనీసం కాంట్రాక్టు పద్దతిలో అయినా వైద్యుల పోస్టులు భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినట్టుంది.

ఈ నేపథ్యంలో ఏడాది ఒప్పంద పద్ధతిలో 1,184 వైద్యుల పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ జనరల్, జిల్లా ఆస్పత్రుల్లో వైద్యులు, స్పెషలిస్టు డాక్టర్లు, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ల నియామకం నిమిత్తం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. 592 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు, 192 అనస్తటిస్టులు, 400 జనరల్, పల్మనరీ మెడిసిన్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నెల 19లోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

Tags: medical officers, doctors, notification for doctors, andhra pradesh,

Advertisement

Next Story

Most Viewed