అవన్నీ ఫ్రీ.. వరద బాధితులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

by srinivas |   ( Updated:2021-11-22 02:48:27.0  )
CM-JAGAN-12
X

దిశ, ఏపీ బ్యూరో: వరద బాధితులకు ఊరట కల్పిస్తూ జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. ఇటీవల కురిసిన వర్షాలతో చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కడప జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. దీని వల్ల పలువురు నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. వరద ప్రభావిత జిల్లాలో నిరాశ్రయులైనవారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. వరద బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ వంటనూనె, కేజీ ఉల్లిగడ్డలు, కేజీ బంగాళాదుంపలను ఉచితంగా సరఫరా చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లోని వరద బాధితులకు ఈ ఉచిత సాయం అందనుంది. వరదల్లో పూర్తిగా ఇల్లు ధ్వంసం అయిన వారికి రూ. 95,100 పరిహారం ఇవ్వాలని, కొత్త ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పాక్షికంగా నష్టం వాటిల్లిన ఇంటికి రూ. 5200 నగదు వెంటనే అందించేలా చూడాలన్నారు.

epaper – 1:30 PM AP EDITION (22-11-21) చదవండి

Advertisement

Next Story