ఆ గెస్ట్‌హౌస్ అభివృద్ధిపై జగన్ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్..

by srinivas |
ఆ గెస్ట్‌హౌస్ అభివృద్ధిపై జగన్ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్..
X

దిశ, ఏపీబ్యూరో : విజయవాడ స్టేట్ గెస్ట్‌హౌస్ ప్రాంగణం అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మిషన్ బిల్డ్ ఏపీ ప్రాజెక్టు కింద కమర్షియల్ డెవలప్‌మెంట్‌ కోసం ప్రైవేటు సంస్థకు బాధ్యతలు అప్పగించింది. ఇందుకోసం అవసరమైన మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేసే బాధ్యతను రుద్రాభిషేక్ సంస్థకు అప్పగించింది.

రాష్ట్ర అతిథి గృహం స్వరాజ్ మైదానం వద్ద 3.26 ఎకరాల్లో విస్తరించి ఉండగా.. అందులో 2.5 లక్షల చదరపు మీటర్ల నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పూర్తి కానుందని ప్రభుత్వం తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed