- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మా వాటా నీళ్లు మాత్రమే తరలిస్తాం..’
దిశ, వెబ్‌డెస్క్: పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు విషయంపై ఏపీ ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ నారాయణరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాయలసీమ ఎత్తిపోతల పథకం పాత ప్రాజెక్టు అని.. పాత ప్రాజెక్టులకు డీపీఆర్ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పస్టం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి కేంద్రానికి ఇప్పటికే డీపీఐ పంపామని వెల్లడించారు. నీళ్లు తీసుకునే సదుపాయాన్ని మాత్రమే ఏర్పాటు చేసుకుంటున్నామని అన్నారు. అంతేగాకుండా పోతిరెడ్డిపాడు ద్వారా తమిళనాడుకు కూడా మంచినీళ్లు ఇవ్వాలని, అందుకే పోతిరెడ్డిపాడుకు లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు జరగడం లేదని, కేవలం సర్వే మాత్రమే నడుస్తుందని స్పష్టం చేశారు. మా వాటా నీళ్లు మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి తరలిస్తామని అన్నారు. తెలంగాణ సీతారామ ప్రాజెక్టు, తుపాకులగూడెం ప్రాజెక్టులు కొత్తవని తెలిపారు. కొత్త ఆయకట్టు, కొత్త స్టోరేజి కెపాసిటీ చేరిస్తే ఏ ప్రాజెక్టు అయినా కొత్తదే అని అన్నారు. కృష్ణా రివర్ బోర్డును వైజాగ్ తరలిస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. కేఆర్ఎంబీ పరివాహక ప్రాంతంలోనే ఉండాలని వెల్లడించారు.