9 రోజులు పాటించండి చాలు..గుడ్లు పంపిణీలో ఏపీ డీజీపీ

by srinivas |
9 రోజులు పాటించండి చాలు..గుడ్లు పంపిణీలో ఏపీ డీజీపీ
X

మరో 9 రోజులు లాక్‌డౌన్ పాటిస్తే కరోనాను నిర్మూలించవచ్చని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. విజయవాడలోని ఏఆర్ గ్రౌండ్స్‌లో ఆంధ్రాలయోలా కాలేజీ ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీసులకు గుడ్లు పంపిణీ చేసిన సందర్భంగా మాట్లాడుతూ, కరోనా నివారణకు ఈ సమయం చాలా కీలకమని అన్నారు. ప్రజలంతా లాక్‌డౌన్‌ పాటించాలని ఆయన సూచించారు. పోలీస్ సిబ్బంది చేస్తున్న సేవలను గుర్తించి ఆంధ్రా లయోలా కళాశాల పూర్వ విద్యార్థులు. పోలీసు సిబ్బందిలో ఇమ్యూనిటి పవర్ పెంచేందుకు గుడ్లు పంచటం సంతోషంగా ఉందన్నారు. లాక్‌డౌన్‌ సందర్భంగా పోలీస్ సిబ్బంది 24 గంటలు ప్రజల సేవలో నిమగ్నమయ్యారని ఆయన తెలిపారు. లాక్‌డౌన్ నేపధ్యంలో ప్రజల్ని ఇంటి నుండి బయటకు రావద్దని సూచించినా వారు పట్టించుకోవడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల నుంచి ఊరికే బయటకు వచ్చే వారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపుతున్నారని ఆయన చెప్పారు. లయోలా ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, విజయవాడ, గుంటూరులోని 4 వేల మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని, వారందరికీ ప్రతిరోజు 4 వేల గుడ్లు పంపిణీ చేస్తామని చెప్పారు.

Tags: andhra loyola old students association, ap police, egg distribution, vijayawada, guntur

Advertisement

Next Story

Most Viewed