డిప్యూటీ స్పీకర్‌ ‘కోన’కు కరోనా

దిశ, వెబ్ డెస్క్ :

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఇటీవల కాలంలో కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీకి కరోనా పాజిటివ్ నిర్దారణ కాగా, తాజాగా గుంటూరు జిల్లా బాపట్ల ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయనతో పాటు ఆయన భార్యకు కూడా కరోనా నిర్దారణ అయ్యింది.

దీంతో తన పుట్టిన రోజు వేడుకలను రద్దు చేసుకుంటున్నట్లు ఆయన సోషల్ మీడియా మాధ్యమం ద్వారా వెల్లడించారు. కాగా, రేపు (సోమవారం) కోన రఘుపతి పుట్టినరోజు కావడం విశేషం.

Advertisement