- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
హీరోయిన్‌తో అనుష్క సోదరుడి డేటింగ్

దిశ, సినిమా : బాలీవుడ్ హీరోయిన్, ప్రొడ్యూసర్ అనుష్క శర్మ సోదరుడు కర్ణేశ్ శర్మ హెడ్ లైన్స్ టచ్ చేశాడు. యంగ్ హీరోయిన్ తృప్తి దిమ్రితో డేటింగ్‌లో ఉన్నాడన్న న్యూస్ హల్ చల్ చేస్తోంది. ఈ బాలీవుడ్ న్యూ లవ్ బర్డ్స్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని సమాచారం. అనుష్కతో కలిసి క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ బ్యానర్ నెలకొల్పిన కర్ణేశ్.. ఈ సంస్థ నుంచి వచ్చిన ‘బుల్‌బుల్’ సిరీస్ ద్వారా తృప్తిని లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్టార్ట్ అయిన ఫ్రెండ్‌షిప్.. సిరీస్ పూర్తయిన తర్వాత కూడా కొనసాగుతోందని టాక్. ఇదే బ్యానర్‌లో ఇర్ఫాన్ ఖాన్ తనయుడు బాబిల్ ఖాన్‌ను హీరోగా పరిచయం చేస్తుండగా.. ఇందులో కూడా తననే హీరోయిన్‌గా సెలెక్ట్ చేయడం విశేషం. అంతేకాదు అనుష్క శర్మ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ‘మేజర్ మిస్సింగ్’ అంటూ తృప్తి, కర్ణేశ్‌ల ఫొటో పోస్ట్ చేయడంపై నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది.