- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లెజెండరీ సింగర్ బయోపిక్.. కొడుకు కాదు నేనే చేస్తా: అనురాగ్ బసు
దిశ, సినిమా : బాలీవుడ్‌లో బయోపిక్‌లకు ఫుల్ క్రేజ్ ఉంది. లేటెస్ట్‌గా కెప్టెన్ విక్రమ్ బత్రా జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘షేర్‌షా’ సూపర్ హిట్ కాగా.. ప్రజెంట్ మరో బయోపిక్ తెరమీదకు రానున్నట్లు తెలుస్తోంది. లెజెండరీ సింగర్ కిశోర్ కుమార్ జీవితకథను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. ఫిల్మ్ మేకర్ అనురాగ్ బసు ఈ బయోపిక్ తెరకెక్కించాలనే యోచనలో ఉన్నట్లు వెల్లడించాడు.
తనలైఫ్‌లో మ్యూజిక్ కీలకపాత్ర పోషిస్తుందన్న ఆయన.. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మ్యూజిక్‌ను ఎంజాయ్ చేస్తూనే ఉంటానని, అందుకే తన సినిమాల్లో సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తెలిపాడు. అందుకే తన ఫేవరేట్ సింగర్ కిశోర్ కుమార్ బయోపిక్ తీసేందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నానని చెబుతూ.. ‘కిశోర్ కుమార్ కొడుకు నిర్మాత అమిత్ కుమార్ కూడా ఈ బయోపిక్ తీయాలనుకుంటున్నాడని విన్నాను. కానీ వీలైనంత తొందరగా ఈ సినిమా నేనే చేస్తాను’ అని వెల్లడించాడు.