క్రికెటర్‌తో అనుపమ మ్యారేజ్.. ఈ వారంలోనే సుముహుర్తం!

by Anukaran |
Anupama Parameshwaran Jasprit Bumrah
X

దిశ, సినిమా: ఇటీవలి కాలంలో హీరోయిన్స్, క్రికెటర్స్ మధ్య రిలేషన్‌షిప్ కామన్ అయిపోయింది. నటులు, క్రికెటర్లు ఒకరితో మరొకరు కనెక్ట్ అవడం, లవ్ అండ్ మ్యారేజ్ చేసుకోవడం చాలా సందర్భాల్లో చూశాం. ఆ కోవకు చెందిన రిలేషన్ షిపే ప్రెట్టియెస్ట్ అనుపమ పరమేశ్వరన్, క్రికెటర్ జస్ ప్రీత్ బుమ్రా మధ్య ఉందని ఇంతకు ముందే ప్రచారం జరిగింది. అయితే ఇదంతా ఫేక్ అని గతంలో కొట్టిపారేసిన అనుపమ..ఇప్పుడు తనతో పెళ్లి పీటలు ఎక్కబోతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వారంలో గుజరాత్‌ లేదా గోవాలో మ్యారేజ్ చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ కోసం బీసీసీఐ నుంచి జస్ ప్రీత్ బుమ్రా లీవ్ తీసుకోవడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది. మరి దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వెలువడుతుందా? లేక ఫేక్ న్యూస్‌గానే మిగిలిపోతుందా తెలియాలంటే ఇంకొంత కాలం వేచి చూడాలి.

Advertisement

Next Story

Most Viewed