- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్లాక్ ఫంగస్‌తో వ్యక్తి మృతి
దిశ, ప్రతినిధి, రంగారెడ్డి: బ్లాక్ ఫంగస్ తో వ్యక్తి మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. కుటుంబ సభ్యులు, జిల్లా ఆసుపత్రి సూపరిటెండెంట్ మల్లికార్జున కథనం ప్రకారం… తాండూరు మండలంలోని ఎల్మకన్య గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి చైల్డ్ లైన్ నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వెంకట్ రెడ్డికి ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్నాడు. అయితే కొన్ని రోజులకే కంటికి కొద్దిగా ఇన్స్పెక్షన్ కావడంతో అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం అడ్మిట్ చేశారు.
అనంతరం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉండటంతో.. మహబూబ్‌నగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ సదరు వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఈ విషయాన్ని మాజీ ఎంపిటిసి గౌడి వెంకటేశం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంకటరెడ్డి ఆరోగ్య విషయాన్ని ఎంపీ రంజిత్ రెడ్డికి తెలియజేశారు. దీంతో ఎంపీ రంజిత్ రెడ్డి ఫంగస్ కోసం ఏర్పాటుచేసిన కోటి ఆస్పత్రి డీఎంఈ రమేష్ రెడ్డితో మాట్లాడారు. అప్పటి వరకు గాంధీలో చికిత్స పొందుతున్న వ్యక్తిని శనివారం ఆసుపత్రికి తరలించాలని అనుకున్న తరుణంలో శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు.