- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుశాంత్ పేరుతో ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్‌కు ఫుల్ పబ్లిసిటీ.. సోషల్ మీడియాకు బ్రేక్!
దిశ, సినిమా : లేట్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి జూన్ 14 నాటికి ఏడాది కావాల్సి వస్తుంది. కానీ తను ఆత్మహత్య చేసుకున్నాడా? లేక హత్య చేశారా? అనే విషయాన్ని ఇంకా నిర్ధారించలేకపోయారు పోలీసులు. సుశాంత్ డెత్ యానివర్సరీ దగ్గర్లోనే ఉండటంతో సుశాంత్ ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ అంకితా లోఖండే సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చింది. ‘ఇది గుడ్ బై కాదు, సీ యూ లేటర్’ అంటూ పోస్ట్ చేసి బ్రేక్ తీసుకున్నట్లు తెలిపింది. దీంతో అంకిత ఫ్యాన్స్ తనకు మద్దతు ఇస్తూ కామెంట్ చేశారు. ప్రజల ముందు ఎప్పుడూ తన బాధను చూపించని అంకిత.. గొప్ప వ్యక్తి అని కొనియాడారు. సుశాంత్‌కు న్యాయం జరిగేందుకు తాము ఎల్లప్పుడూ ప్రార్థిస్తామన్నారు. సుశాంత్ గురించి ఏడుస్తూ బాధపడుతున్నామని, తన కుటుంబానికి దేవుడు మరింత బలాన్ని ఇవ్వాలని కోరుకున్నారు.
అయితే ఓ నెటిజన్ మాత్రం అంకిత పోస్ట్‌పై నెగెటివ్ కామెంట్ చేశాడు. సుశాంత్ విషయంలో అంకిత కపట నాటకం ఆడుతుందని ఆరోపించాడు. ఎస్ఎస్ఆర్ పేరు మీద భారీ పబ్లిసిటీ సంపాదించుకున్న అంకిత.. డెత్ యానివర్సరీకి ముందు అండర్‌గ్రౌండ్ వెళ్తుందని, తర్వాత తిరిగివస్తానని చెప్తుందన్నాడు.