- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెవెన్యూ అధికారుల తప్పిదం.. MPP సభలో స్థానిక నేతల రసాభాసా..
దిశ, స్టేషన్ ఘన్‌పూర్ : రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, తప్పిదాల కారణంగా మండలంలోని 9 గ్రామాలకు చెందిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. 5వేల ఎకరాల పట్టా భూములు ప్రభుత్వ భూములుగా మార్చిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా జఫర్గడ్ మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు నిరసనకు దిగారు.
బుధవారం జఫర్గడ్ మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ సుదర్శన్ అధ్యక్షతన ప్రారంభమైంది. సమావేశం ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే మండల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పోడియం ముందు బైఠాయించారు. 2016లో ఉప్పుగల్లు, తమ్మడపల్లి, తిమ్మంపేట, కోన ఈ చలన్, జఫర్గడ్, హిమ్మత్ నగర్, సాగరం, షాపల్లి గ్రామాలకు చెందిన ఐదు వేల ఎకరాల పట్టా భూములను ప్రభుత్వ భూములుగా రికార్డు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూములుగా మార్చిన అధికారులపై చర్యలు తీసుకొని రైతులు పేర మార్చాలని కోరారు. అప్పటివరకు సర్వసభ్య సమావేశం లేదని రాజీనామాలకు సిద్ధమని డిమాండ్ చేస్తూ పోడియం ముందు బైఠాయించారు.