- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ts High Court: అవినాశ్‌రెడ్డికి చుక్కెదురు
దిశ, డైనమిక్ బ్యూరో: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తీర్పును వెల్లడించలేదు. తీర్పును జూన్ 5కు వాయిదా వేసింది. అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఇరువాదనలు విన్న తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించలేమని స్పష్టం చేసింది. వెకేషన్ బెంచ్‌ని మార్చుకుంటారా అని జడ్జి ప్రశ్నించారు. ఇది అర్జెంట్ అని...తీర్పు ఇవ్వాలని ఇరుపక్షాలు కోరాయి. అత్యవసరమైతే చీఫ్ కోర్టుకు వెళ్లాలని న్యాయమూర్తి సూచించారు. ఈనెల 29 నుంచి తెలంగాణ హైకోర్టుకు సెలవులు అని ఈ నేపథ్యంలో వెకేషన్ తర్వాత తీర్పు ఇస్తామని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. అర్జెన్సీ అయితే మాత్రం చీఫ్ జస్టిస్ ముందు మెన్షన్ చేసి అర్జెంట్ అని చెప్పాలని సూచించించింది.
మేం జోక్యం చేసుకోలేం
వివేకా హత్యకేసు విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్ తీర్పు అన్ని రోజులు రిజర్వ్‌లో పెడితే బాగుండదని కాబట్టి సీబీఐ తన పని తాను చేసుకు పోవచ్చునని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తాము కలుగజేసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు డైరెక్షన్ స్పష్టంగా ఉన్నాయని న్యాయస్థానం తెలిపింది. సీబీఐ విచారణ చేసుకోవచ్చని తేల్చి చెప్పింది. ఈ పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వలేమని న్యాయస్థానం తెలిపింది. అయితే బెయిల్ పిటిషన్ తేలేవరకు చివరకు రెండువారాలైన తదుపరి చర్యలు తీసుకోకుండా ఆపాలని ఎంపీ అవినాశ్ రెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు. అయితే సుప్రీంకోర్టు ఉత్వర్వులు నేపథ్యంలో తాము కలుగజేసుకోలేమని హైకోర్టు తెలిపింది. దీంతో సీజే ధర్మాసనం ముందు ఎంపీ అవినాశ్ రెడ్డి తరఫు న్యాయవాది కేసును మెన్షన్ చేశారు. ఇప్పటికిప్పుడు అవినాశ్ బెయిల్ పిటిషన్‌ను విచారించలేమన్న సీజే ధర్మాసనం తెలిపింది. వెకేషన్ బెంచ్ ముందే మెన్షన్ చేసుకోవాలని అవినాశ్ రెడ్డి లాయర్లకు సీజే ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్ 5కి వాయిదా వేసింది.
ఒత్తిడి తీసుకురావొద్దు
మధ్యంతర బెయిల్ పిటిషన్ సుదీర్ఘ విచారణ అనంతరం తెలంగాణ హైకోర్టు ఇరు పక్షాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణ అర్జెంట్ అని ఒత్తిడి తీసుకురావద్దని సూచించింది. ఇప్పటికి ఇప్పుడు వాదనలు వినాలంటూ కోర్టు మీద ఒత్తిడి తీసుకురావద్దని సూచించింది. ఈ రోజు, రేపు, ఎల్లుండి వినాలని చెప్పడం సరికాదని హితవు పలికింది. ఈ విషయమై సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిందని తెలిపింది. ఈ రోజు వాదనలు విన్నప్పటికీ ఈ రోజు తీర్పు ఇవ్వలేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. మరోవైపు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఈ కేసు మీద కామెంట్స్ చేశాక ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు అని హైకోర్టు సీజే అసహనం వ్యక్తం చేశారు.
Also Read..
తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు.. తిరిగి మళ్లీ ఎప్పుడు ప్రారంభమంటే..?