Mission Rayalaseema: రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించిన లోకేశ్.. భారీగా హామీలు

by srinivas |   ( Updated:2023-06-07 14:13:09.0  )
Mission Rayalaseema: రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించిన లోకేశ్.. భారీగా హామీలు
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కడప జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాయలసీమ డిక్లరేషన్‌ను ఆయన ప్రకటించారు. మిషన్ రాయలసీమ పేరుతో ప్రముఖులతో చర్చా వేదిక నిర్వహించారు. అనంతరం రాయలసీమకు వరాలు కురిపించారు. రాయలసీమలో స్పోర్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్పోర్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా రాయలసీమను అభివృద్ధి చేస్తామన్నారు. అంతర్జాతీయ పోటీలకు క్రీడాకారులను పంపడమే తమ లక్ష్యమని చెప్పారు. అన్ని రకాల క్రీడలకు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీలు కల్పిస్తామని, అలాగే కొత్త స్టేడియాలు నిర్మిస్తామని లోకేశ్ ప్రకటించారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, టైగర్ ఎకో టూరిజం ఏర్పాటు చేస్తామన్నారు. తద్వారా గిరిజనులు, చెంచులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.

వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత నీరు అందిస్తామని లోకేశ్ తెలిపారు. పాడి రైతులను ప్రత్యేకంగా ఆదుకుంటామని వ్యాఖ్యానించారు. పశువుల కొనుగోలు నుంచి మేత, మందుల వరకూ సబ్సిడీ అందజేస్తామన్నారు. గొర్రెలు, మేకల పెంపకానికి ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఉచితంగా గొర్రెలు, మేకల పంపిణీ చేస్తామన్నారు. పశువుల మేత కోసం బంజరు భూములు కేటాయిస్తామని పేర్కొన్నారు. రాయితీ రుణాలతో ఫామ్స్ ఏర్పాటుకు కృషి చేస్తామని నారా లోకేశ్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed