పద్ధతి‌గా నడుచుకోండి.. లేదంటే తాట తీస్తా: SP Siddharth Kaushal

by srinivas |   ( Updated:2023-11-02 17:38:04.0  )
పద్ధతి‌గా నడుచుకోండి.. లేదంటే తాట తీస్తా: SP Siddharth Kaushal
X

దిశ, కడప: గతంలో ఏం జరిగిందో తనకు తెలియదని, కానీ ఇప్పుడు పద్ధతి మార్చుకోవాలని, ఇదే ఫైనల్ అంటూ ట్రబుల్ మాంగర్లను ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ వార్నింగ్ ఇచ్చారు. అలా కాదని తప్పిదాలు చేస్తే తాట తీస్తానని చెడు నడత కలిగిన వారినిహెచ్చరించారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో నడత కలిగిన వారికి, ట్రబుల్ మాంగర్ల‌కు ఎస్పీ కౌన్సిలింగ్ నిర్వహించారు.


ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ నడత కలిగిన వారు, ట్రబుల్ మాంగర్ల‌ కదలికలపై పోలీసు నిఘా ఉంటుందన్నారు. తమ కదలికలను గ్రామ, వార్డు స్థాయిలో పోలీస్ సిబ్బంది నోట్ బుక్ ‌ నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని గమనించి ఒళ్లు దగ్గర పెట్టకొని తమ ప్రవర్తనను మార్చుకోవాలన్నారు. దందాలు, పంచాయితీలు మానుకోవాలన్నారు. ఇకపై ఏదైనా నేరం చేసినా, చేయించినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

ప్రతి వారం విధిగా పోలీసు స్టేషన్‌ లోహాజరు వేయించుకోవడంతో పాటు అసాంఘిక శక్తులు, కార్యక్రమాలపై సమాచారం అందించాలన్నా రు. లేనిపక్షంలో ఆయా ప్రాంతాల్లో జరిగే నేరాలకు అక్కడున్న బ్యాడ్ క్యారెక్టర్ వారు, ట్రబుల్ మంగర్లు నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రజా జీవనానికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే దండన తప్పదన్నారు. భవిష్యత్తులో ఎటువంటి చెడు పనులకు పాల్పడకుండా తమ బంధువుల తరపున, పెద్దల నుండి పూచీ ఇస్తూ పోలీస్ శాఖకు బాండ్లు ఇవ్వాలని ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆదేశించారు.

Advertisement

Next Story