Kadapa: నారా లోకేశ్‌పై కోడిగుడ్ల దాడి..ఇద్దరి అరెస్ట్

by srinivas |   ( Updated:2023-06-07 15:54:09.0  )
Kadapa: నారా లోకేశ్‌పై కోడిగుడ్ల దాడి..ఇద్దరి అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై కోడిగుడ్ల దాడి కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు పెన్నానగర్‌కు చెందిన బాబు, శ్రీకాంత్‌ ఈ నెల ప్రొద్దుటూరులో నారా లోకేశ్‌పై కోడి గుడ్లు విసిరారు. టీడీపీ నేతల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోజులు బాబు, శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితులిద్దరూ కూడా స్నేహితులని, సెల్ఫీ ఇవ్వలేదని గుడ్లు విసిరినట్టు చెప్పారని ఏఎస్పీ ప్రేరణ కుమార్ తెలిపారు.

కాగా జూన్ 1న నారా లోకేశ్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని మైదుకూరు రోడ్డు మార్గంలో యువగళం పాదయాత్ర నిర్వహిస్తుండగా ఆయనపై ఇద్దరు వ్యక్తులు కోడిగుడ్ల దాడి చేశారు. అయితే లోకేశ్ సిబ్బందిపై పడ్డాయి. దీంతో లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే నిరసనకు దిగారు. పోలీసులు సర్ది చెప్పడంతో పాదయాత్రను యథావిధిగా కొనసాగించారు.

Read more: గు**లో గూటం దింపేస్తా.. అరె నీ చింతకాయ పని చేస్తాదా..? టీడీపీ నేతలకు సినీనటి వార్నింగ్ (వీడియో)

Advertisement

Next Story